టార్చిలైట్‌ వెలుగులో కంటి ఆపరేషన్లు

Eye Surgeries In Torchlight, Uttar Pradesh Medical Officer Removed - Sakshi

ఉన్నావ్‌(ఉత్తరప్రదేశ్‌): టార్చిలైటు వెలుతురులో 32 మందికి కంటి శుక్లాల ఆపరేషన్‌ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ఉన్నావ్‌ దగ్గర్లోని నవాబ్‌గంజ్‌లోని ఓ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం ఘటనపై విచారణకు ఆదేశించింది. ఘటనపై ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నావ్‌ ప్రధాన వైద్య అధికారి(సీఎంవో) రాజేంద్ర ప్రసాద్‌ను సస్పెండ్‌ చేశారు. హెల్త్‌ సెంటర్‌ ఇన్‌చార్జిని తొలగించారు. కాగా, ఆపరేషన్‌ తర్వాత రోగులను నేలమీద పడుకోబెట్టారని పలువురు ఆరోపించారు. ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం, పవర్‌ బ్యాకప్‌ లేకపోవడంతో టార్చిలైటు వెలుతురులో శస్త్రచికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top