కేంద్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుంది.
	న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశం కానుంది. కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి నేపథ్యంలో కేంద్ర కేబినెట్  సాయంత్రం నాలుగు గంటలకు  సౌత్బ్లాక్లో ఈ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే మృతికి మంత్రివర్గం సంతాపం తెలియచేయనుంది. కాగా ముండే మృతితో బుధవారం జరగాల్సిన ఎంపీల ప్రమాణ స్వీకారం వాయిదాపడే అవకాశం ఉంది.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
