రూ.435 కోట్లు పెట్టి బంగ్లా కొనుక్కుంది | DLF boss daughter Renuka Talwar buys bungalow with Rs 435 crore | Sakshi
Sakshi News home page

రూ.435 కోట్లు పెట్టి బంగ్లా కొనుక్కుంది

Dec 19 2016 9:50 AM | Updated on Sep 4 2017 11:07 PM

సాధారణంగా ఒక బంగ్లాను ఓ కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొనుగోలు చేస్తేనే అవాక్కవుతాం.. అలాంటిది ఏకంగా ఓ 400 కోట్లు పెట్టి కొనుగోలు చేశారంటే వినేవారి పరిస్థితేమిటి.

న్యూఢిల్లీ: సాధారణంగా ఒక బంగ్లాను ఓ కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొనుగోలు చేస్తేనే అవాక్కవుతాం.. అలాంటిది ఏకంగా ఓ 400 కోట్లు పెట్టి కొనుగోలు చేశారంటే వినేవారి పరిస్థితేమిటి. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది నిజమే.. ప్రముఖ వ్యాపార దిగ్గజం డీఎల్ఎఫ్‌ సంస్థ చైర్మన్‌ కేపీ సింగ్‌ కూతురు రేణుకా తల్వార్‌ కళ్లు చెదిరే రేంజ్‌లో ఏకంగా రూ.435 కోట్లు పెట్టి ఢిల్లీలోని పృధ్వీరాజ్‌ రోడ్డులోని బంగ్లాను కొనుగోలు చేశారు. టీడీఐ ఇన్‌ఫ్రా కార్పొరేషన్‌ డెవలపర్స్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కమల్‌ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించారు.

ఈ బంగ్లా మొత్తం ఫ్లాట్‌ 4,925 స్క్వేర్‌ మీటర్స్‌ ఉండగా ఒక్కో స్క్వేర్‌ మీటర్‌కు రూ.8.8లక్షలు పెట్టి రేణుకా తల్వార్ కొనేశారు. ఈ రోడ్డులో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడు పోయిన బంగ్లా రూ.173కోట్లలో ఉండగా.. తాజాగా పెద్ద మొత్తం చెల్లించిన బంగ్లాగ తల్వార్‌ది నిలవనుంది. డీఎల్‌ఎఫ్‌ లోనే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న జీఎస్‌ తల్వార్‌ను రేణుకా తల్వార్‌ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె తండ్రి కేపీ సింగ్‌ కు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం రోడ్డులో రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. తల్వార్‌ కొత్తగా కొనుగోలు చేసిన భవంతికి సంబంధించి కొనుగోలు దార్లను, విక్రేతలను ప్రశ్నించగా స్పందించలేదు.

Advertisement

పోల్

Advertisement