breaking news
Renuka Talwar
-
బంగ్లా ఖరీదే వందల కోట్లు.. ఎవరీ రేణుకా తల్వార్!
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిది అంటే.. ముందుగా చాలామందికి ముఖేష్ అంబానీ లేదా గౌతమ్ ఆదానీ వంటి పారిశ్రామికవేత్తల పేర్లే గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలో మాత్రం అత్యంత ఖరీదైన ఇల్లు ఒక మహిళకు చెందింది. ఇంతకీ ఆమె ఎవరు, ఆ ఇంటి ఖరీదు ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీలో ఖరీదైన ఇల్లు కలిగిన మహిళ పేరు 'రేణుకా తల్వార్'. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ 'కేపీ సింగ్' కుమార్తె. ఈమె కొనుగోలు చేసిన ఇల్లు పృథ్వీరాజ్ రోడ్లో ఉంది. టీడీఐ ఇన్ఫ్రా కార్పొరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. 2016లో ఈ బంగ్లాను రూ. 435 కోట్లతో కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 510 కోట్లు వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మన దేశంలో అత్యంత ఖరీదైన బంగ్లాలలో ఒకటిగా నిలిచింది. దీని విస్తీర్ణం దాదాపు 5000 చ.మీ కాగా ఇంటి నిర్మాణ ప్రాంతం రూ. 1189 చ.మీ. అంటే ఈ భారీ విలాసవంతమైన ఇల్లు చదరపు మీటరు ఖరీద్దు ఏకంగా రూ. 8.8 లక్షలు. ఇదీ చదవండి: కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి.. రేణుకా తల్వార్ కంటే ముందు, ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన పృథ్వీరాజ్ రోడ్లో షాహీ ఎక్స్‌పోర్ట్స్ హరీష్ అహుజా రూ. 173 కోట్లతో ఖరీదైన భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం ఉన్న రేణుకా తల్వార్ బంగ్లా పరిమాణంలో సగం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నికర సంపద విలువ ఏకంగా రూ. 2780 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. -
రూ.435 కోట్లు పెట్టి బంగ్లా కొనుక్కుంది
న్యూఢిల్లీ: సాధారణంగా ఒక బంగ్లాను ఓ కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొనుగోలు చేస్తేనే అవాక్కవుతాం.. అలాంటిది ఏకంగా ఓ 400 కోట్లు పెట్టి కొనుగోలు చేశారంటే వినేవారి పరిస్థితేమిటి. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇది నిజమే.. ప్రముఖ వ్యాపార దిగ్గజం డీఎల్ఎఫ్ సంస్థ చైర్మన్ కేపీ సింగ్ కూతురు రేణుకా తల్వార్ కళ్లు చెదిరే రేంజ్లో ఏకంగా రూ.435 కోట్లు పెట్టి ఢిల్లీలోని పృధ్వీరాజ్ రోడ్డులోని బంగ్లాను కొనుగోలు చేశారు. టీడీఐ ఇన్ఫ్రా కార్పొరేషన్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కమల్ తనేజా ఆమెకు ఈ బంగ్లాను విక్రయించారు. ఈ బంగ్లా మొత్తం ఫ్లాట్ 4,925 స్క్వేర్ మీటర్స్ ఉండగా ఒక్కో స్క్వేర్ మీటర్‌కు రూ.8.8లక్షలు పెట్టి రేణుకా తల్వార్ కొనేశారు. ఈ రోడ్డులో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడు పోయిన బంగ్లా రూ.173కోట్లలో ఉండగా.. తాజాగా పెద్ద మొత్తం చెల్లించిన బంగ్లాగ తల్వార్ది నిలవనుంది. డీఎల్ఎఫ్ లోనే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జీఎస్ తల్వార్‌ను రేణుకా తల్వార్ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె తండ్రి కేపీ సింగ్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో రెండు ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. తల్వార్ కొత్తగా కొనుగోలు చేసిన భవంతికి సంబంధించి కొనుగోలు దార్లను, విక్రేతలను ప్రశ్నించగా స్పందించలేదు.