వారంలో రామ మందిరంపై నిర్ణయం: వీహెచ్‌పీ | Decision on Ram temple in Ayodhya within a week, says VHP | Sakshi
Sakshi News home page

వారంలో రామ మందిరంపై నిర్ణయం: వీహెచ్‌పీ

Mar 5 2017 1:32 AM | Updated on Aug 25 2018 7:50 PM

అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడు ప్రవీణ్‌ తొగాడియా శనివారం అన్నారు.

మథుర: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్‌ నాయకుడు ప్రవీణ్‌ తొగాడియా శనివారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారతీయులు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన కోరారు. గోరక్షకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాలను వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. గోవులను కోస్తున్న కసాయి వారికి శిక్ష వేయాలని గోరక్షకులు కేవలం ఆవులను రక్షిస్తున్నారని తొగాడియా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement