ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వీఐపీ దర్శనం పాస్‌ల ధర పెంచుతూ సాయబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయం తీసుకుంది.
ముంబై (మహరాష్ట్ర) : ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో వీఐపీ దర్శనం పాస్‌ల ధర పెంచుతూ సాయబాబా సంస్థాన్ ట్రస్టు (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయం తీసుకుంది. సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి బాజీరావ్ షిండే ఈ మేరకు శుక్రవారం వివరాలు వెల్లడించారు. వీఐపీ పాస్ ధరను రూ.100 నుంచి రూ.200కు, ఉదయం హారతి (కాకడ్) వీఐపీ పాస్ ధరను రూ.500 నుంచి రూ.600కు పెంచినట్లు చెప్పారు.
మధ్యాహ్నం హారతి ధర కూడా రూ.300 నుంచి రూ.400కు పెంచామని, పెంచిన ధరలు మార్చి ఒకటి నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. సాధారణ భక్తులకు ప్రసాదం (స్వీట్‌మీట్) ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. భక్త నివాస్‌లో మార్చి ఒకటి నుంచి పాస్ విక్రయ కౌంటర్ ప్రారంభించనున్నట్లు ఎస్‌ఎస్‌ఎస్‌టీ వెల్లడించింది.