బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం | Counting begins for Bihar assembly results | Sakshi
Sakshi News home page

బిహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

Nov 8 2015 8:00 AM | Updated on Jul 18 2019 2:11 PM

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 243 స్థానాలకు సంబంధించి 62,780 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరంభమైంది.

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 243 స్థానాలకు సంబంధించి 62,780 ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. మధ్యాహ్నంలోపు మెజారిటీ స్థానాల్లో ఫలితం తేలుతుంది. బిహార్ అసెంబ్లీకి అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు దశల్లో కలిపి రికార్డ్ స్థాయిలో, అత్యధికంగా 56.8% పోలింగ్ నమోదైంది.

272 మంది మహిళలు సహా మొత్తం 3450 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. బిహార్ ఎన్నికల చరిత్రలోనే హత్యలు, హింస లేని ఎన్నికలు కూడా ఇవే. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా జేడీయూ-ఆర్జేడీ కూటమి గెలుపుపై లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహా కూటమిదే విజయమని, నితీష్ కుమారే కాబోయే ముఖ్యమంత్రి అంటూ జోస్యం చెప్పారు.

కాగా ఇప్పటి వరకూ బీజేపీ ఆరు స్థానాల్లోనూ, మహా కూటమి మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement