భారత్‌లో కరోనా : 52,952 కేసులు, 1,783 మంది మృతి | Coronavirus : 3561 New Cases Registered In India | Sakshi
Sakshi News home page

24 గంటల్లో 3561 కొత్త కేసులు

May 7 2020 7:47 PM | Updated on May 7 2020 8:07 PM

Coronavirus : 3561 New Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గు ముఖం పట్టడం లేదు. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటలో(గురువారం సాయంత్రం 6 గంటల నాటికి) దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు సంభవించాయి.ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
(చదవండి : జూన్, జూలైలో కరోనా మరింత ప్రభావం!)

 గురువారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,952కి చేరింది. మృతుల సంఖ్య మొత్తం 1,783కి చేరింది. కాగా ఇప్పటి వరకు కరోనా నుంచి 15,266 మంది కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు.  ప్రస్తుతం35,902 మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో గురువారం సాయంత్రం నాటికి 16758 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 651 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. ఇక ఢిల్లీలో 5532, తమిళనాడులో 5532, మధ్యప్రదేశ్‌లో 3138 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement