దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేదికపై విపక్షాలు ఏకమయ్యాయి.
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేదికపై విపక్షాలు ఏకమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న నెహ్రు 125 జయంతి వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారం ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కాగా నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరపున పాల్గొనే తొమ్మిది మంది సభ్యుల బృందానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.