breaking news
global event
-
అలియా హాలీవుడ్ ఎంట్రీ: ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలిస్తే..!
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఫ్యాన్ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీ అలియా తన గ్లామర్ లుక్‌లో అందర్ని మరోసారి మెస్మరైజ్ చేసింది. బ్రెజిల్‌లోని సావో పాలోలో జరిగిన నెట్‌ఫ్లిక్స్ టుడమ్ 2023 ఈవెంట్‌కు హాజరైన అలియా రెండో రోజు అందంగా మెరిసిపోయింది. ఫుల్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్‌లో గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ డ్రెస్ ఖరీదు ఎంత అనేది చర్చకు తెర లేచింది. అలియా భట్ హై వెయిస్ట్ పెప్లమ్ గౌను ధర రూ. 1.38 లక్షలు ఎక్కడ ఏమి ధరించాలో అలియా భట్‌కి తెలుసు, అందులోనూ గ్లోబల్ ఈవెంట్, హాలీవుడ్ ఎంట్రీ.. తొలిరోజు విమర్శల నేపథ్యంలో రెండో రోజు జాగ్రత్త పడింది. హై వెయిస్ట్ పెప్లమ్ , సెంటర్-బ్యాక్ స్లిట్, బాడీ ఫిట్టింగ్ గ్రీన్ డ్రెస్‌లో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది. ఈ డ్రెస్ ధర 1690 డాలర్లు అంటే రూ.1,38,525 అన్నమాట. హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు ఈ సినిమా ట్రైలర్లాంచ్తో మరో మెట్టు ఎదిగిపోయింది. క్లాస్ మినిమల్ అవతార్‌లో హార్ట్ ఆఫ్ స్టోన్ సహ-నటులు గాల్ గాడోట్, జామీ డోర్నన్‌లతో కలిసి పోజులిచ్చింది. ఈ ఫోటోలను షేర్ చేసిన అలియా "ఒబ్రిగాడో బ్రెజిల్...అందరి ప్రేమకు ధన్యవాదాలు! అంటూ గ్రీన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేయడం విశేషం. కాగా ఇదే ఈవెంట్లో తొలి రోజు డ్రెస్సింగ్‌కు సంబంధించి అలియా అద్భుతంగా కనిపించి నప్పటికీ, ఈవెంట్లో ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్ గురైంది. గన్ని బ్రాండ్ మ్యాచింగ్ స్కర్ట్‌తో పింక్-హ్యూడ్ గ్లోసీ జాకెట్-షేప్ టాప్‌ను ధరించింది. ఈ బ్లేజర్ ధర రూ. 39,952, మ్యాచింగ్ క్రాప్ టాప్ ధర రూ. 20,200. టోటల్‌గా పింక్-హ్యూడ్ శాటిన్ అవుట్‌ఫిట్ ధర రూ. 93,628. -
నెహ్రూ జయంతి సాక్షిగా ఏకమైన విపక్షాలు
న్యూఢిల్లీ : దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ జయంతి వేదికపై విపక్షాలు ఏకమయ్యాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న నెహ్రు 125 జయంతి వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారం ఏచూరి, రాజా తదితరులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాగా నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ అంతర్జాతీయ సదస్సుకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తరపున పాల్గొనే తొమ్మిది మంది సభ్యుల బృందానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారు.