యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలి

Central Minister Kishan Reddy Visits War Memorial - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ​దేశంలోని యువత జవాన్లను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం ఇండియా గేటు సమీపంలోని వార్ మెమోరియల్‌ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమర జవాన్ల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. అధికారులు జవాన్లు చేసిన సేవలను ఆయనకు వివరించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధంలో మరణించిన అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వార్ మెమోరియల్ సందర్శన మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చిందని తెలిపారు. దేశంలోని ప్రజలందరూ వార్‌ మెమోరియల్‌ను సందర్శించాలని సూచించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉందని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top