నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు

CBI Director Alok Verma Cancels Most Transfers - Sakshi

న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్‌ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్‌(ఇన్‌చార్జ్‌)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్‌ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు.

ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్‌పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్‌ డైరెక్టర్‌ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్‌ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్‌ హోదాలో విధులకు హాజరైన ఆలోక్‌ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top