ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు | candidate photo on EVM in RKNAGAR elections | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై ఇక అభ్యర్థుల ఫొటోలు

Jun 19 2015 7:38 PM | Updated on Sep 3 2017 4:01 AM

నిరక్షరాస్య ఓటర్లకు అనుకూలంగా ఉండేందుకు... ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లపై అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని...

చెన్నై, సాక్షి ప్రతినిధి: నిరక్షరాస్య ఓటర్లకు అనుకూలంగా ఉండేందుకు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లపై అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేసే సరికొత్త విధానాన్ని చెన్నై ఆర్కేనగర్‌లో ప్రవేశపెట్టినట్లు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజయ్ సక్సేనా శుక్రవారం చెప్పారు. పార్టీ ఎన్నికల చిహ్నంతోపాటు అభ్యర్థి పేరు, అతని ఫొటోలను ఈవీఎంలపై అమర్చడం వల్ల ఓటర్లకు సులువుగా అర్థం అవుతుందన్నారు. ఈవీఎంలో ఫొటోలను అమర్చే ప్రక్రియను కేంద్ర ఎన్నికల పరిశీలకులు జ్యోతికైలాష్ సమక్షంలో శుక్రవారం ప్రారంభించినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement