రూ.15 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. | BSF recovers three kg heroin in Punjab | Sakshi
Sakshi News home page

రూ.15 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..

Mar 23 2016 4:43 PM | Updated on Sep 3 2017 8:24 PM

భారత్‌ పాక్‌ సరిహద్దు, పంజాబ్‌ ఫెరోజ్‌పర్‌ నిర్ణీత ప్రాంతంలో మూడు కేజీల హెరాయిన్ను బుధవారం బీఎస్‌ఎఫ్‌ సైనికులు పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

చండీఘడ్‌: భారత్‌-పాక్‌ సరిహద్దు, పంజాబ్‌ ఫెరోజ్‌పర్‌ నిర్ణీత ప్రాంతంలో 3 కేజీల హెరాయిన్ను బుధవారం బీఎస్‌ఎఫ్‌ సైనికులు పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూగజ్నీవాలా సరిహద్దు వెలుపలి భాగంలో పాతిపెట్టబడిన 15 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాక సంఘటనా స్థలి వద్ద పాకిస్తాన్‌కు సంబంధించిన రెండు సిమ్‌ కార్డులు కూడా లభ్యమైనట్టు బార్డర్‌ సెక్యూరిటీ పోర్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ఆర్‌.ఎస్‌. కటారియా తెలిపారు.

Advertisement

పోల్

Advertisement