breaking news
Herion recover
-
ట్రంప్ ముఖాకృతితో డ్రగ్స్!
వాషింగ్టన్ : గతంలో ఎవరిమీదైనా కోపం వస్తే ఏదో ఒక జంతువుతో పోల్చి తిట్టేవారు. కానీ ఏ ముహూర్తాన ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడో గానీ ఆనాటి నుంచి జనాలు తమకు నచ్చని వారిని ట్రంప్‌తో పోలుస్తున్నారు. తిట్లతో మాత్రమే సరిపెట్టక ఇప్పుడు ఏకంగా ‘డ్రగ్స్’ (మత్తు పదార్ధాలు)కు కూడా ట్రంప్ పేరు పేట్టేసారు. మత్తు పదార్ధాలు సరఫరా చేసే గ్యాంగ్‌ను పట్టుకోవాలని ఇండియానా స్టేట్ పోలీసులు దాదాపు ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ విషయం గురించి ఇండియానా స్టేట్ పోలీసు అధికారి ‘ఈ నెల 19 నుంచి 21, 26 నుంచి 28 మధ్య ‘ఆపరేషన్ బ్లూ అన్విల్’ పేరుతో దాడులు నిర్వహించాము. నార్త్ సెంట్రలినాలోని 9 డిపార్ట్మెంట్ల అధికారులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 129 మంది మత్తు పదార్ధాలు సరాఫరా చేసేవారిని అదుపులోకి తీసుకున్నాము. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి భారీ ఎత్తున మత్తు పదర్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరెంజ్ రంగులో ఉండే ‘ట్రంప్’ డ్రగ్స్ కూడా ఉన్నాయి’ అన్నారు పోలీసులు. ‘ట్రంప్’ డ్రగ్స్ ఏంటి అనుకుంటున్నారా...పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొన్ని మత్తు పదార్ధాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖాకృతిలో ఉంటాయి. సులభంగా గుర్తు పట్టడానకి వీలుగా పోలీసులు వీటికి ‘ట్రంప్’ డ్రగ్స్‌గా పేరు పెట్టారు. వీటి వెనక ‘గ్రేట్ ఎగేన్’ అని రాసి ఉంది. అయితే ఈ ఆరెంజ్ రంగు మత్తు పదార్ధాలను ‘ట్రంప్’ డ్రగ్స్‌గా పేర్కోనడం ఇదే ప్రథమం కాదు. గతేడాది జర్మన్ పోలీసులు సీజ్ చేసిన మత్తు పదార్ధాల్లో ట్రంప్ మొహాన్ని పోలిన ఈ ఆరెంజ్ రంగు మత్తు పదార్ధాలు దాదాపు 5 వేల వరకూ దొరికాయి. అప్పటి నుంచి వీటికి ‘ట్రంప్ డ్రగ్స్’ గా పేరు పెట్టారు. తాజాగా దొరికిన మత్తు పదార్ధాల్లో ‘ట్రంప్’ డ్రగ్స్‌తో పాటు కొకైన్, హెరాయిన్‌తో పాటుగా మరికొన్ని పేరు తెలియని మత్తు పదార్ధాలు లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. -
రూ.15 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత..
చండీఘడ్: భారత్-పాక్ సరిహద్దు, పంజాబ్ ఫెరోజ్‌పర్ నిర్ణీత ప్రాంతంలో 3 కేజీల హెరాయిన్‌ను బుధవారం బీఎస్ఎఫ్ సైనికులు పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూగజ్నీవాలా సరిహద్దు వెలుపలి భాగంలో పాతిపెట్టబడిన 15 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక సంఘటనా స్థలి వద్ద పాకిస్తాన్‌కు సంబంధించిన రెండు సిమ్ కార్డులు కూడా లభ్యమైనట్టు బార్డర్ సెక్యూరిటీ పోర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఆర్.ఎస్. కటారియా తెలిపారు.