ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్‌ | Book Khadse under sedition, says Kejriwal | Sakshi
Sakshi News home page

ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్‌

Jun 5 2016 4:14 PM | Updated on Oct 8 2018 5:45 PM

ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్‌ - Sakshi

ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలి: కేజ్రీవాల్‌

దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏక్‌నాథ్‌ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: అండర్‌ వరల్డ్‌ డాన్ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్‌ ఖడ్సే ఒక దేశద్రోహి అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఖడ్సేపై దేశద్రోహం కేసు పెట్టాలని కేజ్రీవాల్‌ డిమాండ్ చేశారు.

పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాడిన హార్థిక్‌ పటేల్‌ పై గుజరాత్ ప్రభుత్వం పెట్టిన దేశద్రోహం అభియోగాలను ఎత్తివేయాలని, ఆ అభియోగాలను ఖడ్సేపై పెట్టాలని ఆయన ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు ఉన్న ఖడ్సే ఒక దేశద్రోహి అని ధ్వజమెత్తారు. దావూద్‌తో సెల్‌ఫోన్‌ సంభాషణలు, భూ అక్రమాల ఆరోపణలతో ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement