శ్రీరంగం ఆలయానికి బాంబు బెదిరింపు | Bomb threat to Srirangam temple, probe on | Sakshi
Sakshi News home page

శ్రీరంగం ఆలయానికి బాంబు బెదిరింపు

Nov 25 2014 8:14 PM | Updated on Sep 2 2017 5:06 PM

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయాన్ని బాంబులతో కూల్చివేస్తామనే లేఖ కలకలం రేపుతోంది.

తిరుచిరాపల్లి:తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం పట్టణానికి సమీపంలోఉన్న సుప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని బాంబులతో కూల్చివేస్తామనే లేఖ కలకలం రేపుతోంది. ఈనెల 29లోగా రంగనాథ స్వామి ఆలయాన్నే లక్ష్యంగా చేసుకుని భారీ విధ్వంసం సృష్టిస్తామని కొందరు దుండగులు ఉత్తరం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పాటుగా రైల్వే స్టేషన్లో, బస్సు స్టేషన్లలో కూడా బాంబులతో దాడులు చేస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఉలిక్కిపడిన తిరుచిరాపల్లి పోలీసులు ఆలయం వద్ద భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఈ బెదిరింపు లేఖపై  దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తిరుచిరాపల్లి పోలీస్ కమిషనర్ శైలేష్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

 

ఆలయ ప్రాంగంణంలో 24 గంటలు బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ ప్రవేశానికి, బయటకు రావడానికి మూడు పాయింట్లను ఏర్పాట్లు చేశామన్నారు. దీంతోపాటుగా బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా పోలీసులను అప్రమత్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement