అత్యంత ధనిక పార్టీ బీజేపీ | Bjp is the richest party | Sakshi
Sakshi News home page

అత్యంత ధనిక పార్టీ బీజేపీ

Apr 11 2018 1:34 AM | Updated on Apr 11 2018 9:27 AM

Bjp is the richest party - Sakshi

న్యూఢిల్లీ: 2016–17 ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీల్లో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ ఏడాది బీజేపీకి మొత్తం రూ. 1,034.27 కోట్ల ఆదాయం లభించింది. 2016–17లో ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆదాయం రూ.1,559.17 కోట్లు కాగా అందులో బీజేపీ వాటా 66.34%. అంతకుముందటి సంవత్సరంతో పోలిస్తే బీజేపీ ఆదాయం 2016–17లో ఏకంగా 81.18 శాతం పెరిగింది.

2015–16లో ఆ పార్టీకి వచ్చిన ఆదాయం రూ.570.86 కోట్లే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీలు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల వివరాలను విశ్లేషించిన అసోసియే షన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పార్టీల ఆదాయాల్లో దాదాపు 75 శాతం నిధులు స్వచ్ఛంద విరాళాల ద్వారా వచ్చినవే.

ఇక అతి తక్కువ ఆదాయం పొందిన పార్టీగా సీపీఐ నిలిచింది. సీపీఐకి 2016–17లో వచ్చిన ఆదాయం రూ. 2.08 కోట్లు. రూ. 225.36 కోట్ల ఆదాయం పొందిన కాంగ్రెస్‌ రెండో ధనిక పార్టీగా నిలిచింది. 2016–17లో ఏడు పార్టీలు కలిపి చేసిన మొత్తం వ్యయం రూ.1,228.26 కోట్లు కాగా, ఇందులో బీజేపీ వాటా రూ.710.05 కోట్లు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement