జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎట్టకేలకు పీడీపీ- బీజేపీ మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి ఒకటిన పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 87 స్థానాలున్న కశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ 28, బీజేపీ 25 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయి. తొలిసారిగా కాశ్మీర్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం కానుంది.
కాగా బీజేపీ-పీడీపీ చెరో ఆరు మంత్రి పదవులు తీసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని బీజేపీ దక్కించుకోనుంది. మరోవైపు లాంఛనాలు ముగిసిన తరువాత పీడీపీ అధ్యక్షుడు మహబూబ్ ముఫ్తీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ను కలుస్తారని సమచారం. అనంతరం ఒప్పంద వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.