‘దీదీ రాక్షసి..అఖిలేష్‌ కసాయి’

BJP MLA Surendra Singh Fires Mamata A Demoness Akhilesh A Butcher - Sakshi

లక్నో : తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌పై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ రాక్షసి, అఖిలేష్‌ ఓ కసాయి అంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఎస్పీతో పొత్తును బీఎస్పీ అధినేత్రి మాయావతి తెగతెంపులు చేసుకున్నారని ఆరోపించారు.

లంకను సందర్శించిన హనుమంతుడిని అడ్డుకున్న రాక్షసిలా ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని రాకాసిలా దీదీ అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. యోగి ఆదిత్యానాథ్‌ రూపంలో దేశానికి హనుమంతుడు లభించాడని, ప్రధాని మోదీని ఇక అడ్డుకునేవారు ఎవరూ లేరని, రాక్షసులను అంతం చేసే రోజులు వచ్చాయని, విభీషణుడి యుగం మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌పైనా సింగ్‌ విరుచుకుపడ్డారు. ఆయనను కసాయిగా బీజేపీ ఎమ్మెల్యే సింగ్‌ అభివర్ణించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top