'బీజేపీకి మరో షాక్'
ఒక్క అధికారం చేపట్టినప్పుడు తప్ప ఇప్పటి వరకు బీజేపీకి అస్సలు కలిసి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వరుస వైఫల్యాలు పలకరిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఒక్క అధికారం చేపట్టినప్పుడు తప్ప ఇప్పటి వరకు బీజేపీకి అస్సలు కలిసి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని వరుస వైఫల్యాలు పలకరిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో రత్లాం లోక్ సభ నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నిక బీజేపీకి షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంతిలాల్ భురియ అక్కడ విజయం సాధించాడు.
అంతకుముందు బీజేపీ అభ్యర్థి అక్కడ అధికారంలో ఉండగా అతడు చనిపోవడంతో ఈ ఉప ఎన్నికల జరిగింది. అలాగే మిజోరంలోని థోంగ్జూ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అలాగే, తెలంగాణలోని వరంగల్ ఎంపీ స్థానంకోసం జరిగిన ఉప ఎన్నికలో విజయం అధికార టీఆర్ఎస్ ఖాతాలో పడింది. ఇక రాజస్థాన్ లోని దేవాస్ అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి గాయత్రీ రాజే ప్రస్తుతం 20 వేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మణిపూర్ లో రెండు అసెంబ్లీ స్థానాలు బీజేపీ తన ఖాతాలో వేసుకుంది.


