హాలీవుడ్ సాంగ్కు భరతనాట్యం జోడిస్తే.. | Bharatnatyam goes viral: Bengaluru trio's traditional spin on '50 shades of Grey' tune | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సాంగ్కు భరతనాట్యం జోడిస్తే..

Jun 13 2016 7:05 PM | Updated on Sep 4 2017 2:23 AM

హాలీవుడ్ సాంగ్కు భరతనాట్యం జోడిస్తే..

హాలీవుడ్ సాంగ్కు భరతనాట్యం జోడిస్తే..

ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. అనూహ్యంగా ఆ వీడియోను చూసిన వారి సంఖ్య పెరగడంతో దానిని రూపొందించిన వారు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం వారిని తప్పుబడుతున్నారు.

బెంగళూరు: ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. అనూహ్యంగా ఆ వీడియోను చూసిన వారి సంఖ్య పెరగడంతో దానిని రూపొందించిన వారు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం వారిని తప్పుబడుతున్నారు. ఇంతకీ ఏమిటా వీడియో అంటే.. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే హాలీవుడ్ చిత్రం లో ప్రముఖ సింగర్ ఎలీ గౌల్డింగ్ పాడిన 'లవ్ మి లైక్ యూ డూ' అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఈ పాటను తమ భరతనాట్యంతో మిక్స్ చేస్తూ అబ్బురపరిచేలా బెంగళూరుకు చెందిన ప్రియా వరుణేశ్ కుమార్, ప్రమితా ముఖర్జీ, సంధ్యా మురళీ ధరన్ అనే యువతులు డ్యాన్స్ చేశారు.

వీరికి పియా డ్యాన్స్ కంపెనీ ఉంది. వీరు అలా డ్యాన్స్ చేస్తుండగా అక్కడి గేటెడ్ కమ్యూనిటీ వీడియో తీసి ఆన్ లైన్లో నవంబర్ 2015లో పోస్ట్ చేశారు. అయితే, రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇటీవలె రెండులక్షలమంది వీక్షకులను సంపాదించుకుంది. దీనిని చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా భరత నాట్య ప్రియులు మాత్రం ఒక సంప్రదాయబద్ధమైన నాట్య కళను ఇలా ఇష్టమొచ్చినట్లు ఏవేవో పాటలకు మిక్స్ చేసి ప్రదర్శించడం మంచిపద్ధతి కాదంటూ పెదవి విరుస్తున్నారు. కాగా, ఈ డ్యాన్స్ చేసిన వాళ్లలో ప్రియా స్పందిస్తూ తమ వీడియోకు ఇంతమొత్తంలో స్పందన వచ్చినందుకు పట్టరాని ఆనందంగా ఉందని చెప్పింది. త్వరలో మరో ఇంగ్లిష్ సాంగ్ కు కూడా ఇలాగే డ్యాన్స్ మిక్స్ చేసి మరో వీడియో అప్ లోడ్ చేయనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement