నగరం నడిబొడ్డున స్ట్రిప్ డాన్స్..! | Bengaluru cops find girls performing a striptease at upscale bar, 37 arrested | Sakshi
Sakshi News home page

నగరం నడిబొడ్డున స్ట్రిప్ డాన్స్..!

May 9 2016 7:02 PM | Updated on Sep 3 2017 11:45 PM

గత శనివారం రాత్రి నగరానికి చెందిన ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో స్ట్రిప్ డాన్స్ నిర్వహిస్తున్న ట్లు తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఆ ప్రాంతానికి చేరుకుని 37 మందిని అరెస్టు చేశారు.

బెంగళూరు: గత శనివారం రాత్రి నగరానికి చెందిన ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో స్ట్రిప్ డాన్స్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఆ ప్రాంతానికి చేరుకుని 37 మందిని అరెస్టు చేశారు. కేఎమ్ కరియప్ప రోడ్డులో ఉన్న టైమ్స్ బార్ అండ్ రెస్టారెంట్లో పోలీసులు దాడి చేసి అమ్మాయిలు డాన్స్ చేస్తుండగా డబ్బులు విసిరేస్తున్న కస్టమర్లను అరెస్టు చేశారు.

బార్ అండ్ రెస్టారెంట్ నుంచి బీహార్, నేపాల్ లకు చెందిన 77 మంది అమ్మాయిలను కాపాడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డాన్స్ వేస్తున్న అమ్మాయిల పైన విసిరిన డబ్బు రూ.2 లక్షలను సీజ్ చేశామని చెప్పారు. బార్ ఓనర్లు గంగాశెట్టి, ఓమ్ ప్రకాశ్ యాదవ్, వనిత, శాంతి స్వరూప్, ధానేంద్ర, సయ్యద్ సమీర్ లు కనిపించకుండా పోయారనీ.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నమని వివరించారు. వీరు ఆర్ధికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల్లోని అమ్మాయిలకు ఉద్యోగాలను ఇప్పిస్తామని నమ్మించిబార్ లో స్ట్రిప్ డాన్స్ చేయిస్తారని తెలిపారు. నిందితులపైన కేసును నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement