ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న నాలుగోదశ సాధారణ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం
Feb 23 2017 9:28 AM | Updated on Aug 25 2018 4:30 PM
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న నాలుగోదశ సాధారణ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో విడతలో మొత్తం 53 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది. దాదాపు 1.84 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదే ప్రాంతాల్లో 2012 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందింది. ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్ మరిన్ని సీట్లు తమ ఖాతాలో వేసుకోవడానికి సాయశక్తులా ప్రచారకార్యక్రమాలు నిర్వహించింది.
Advertisement
Advertisement