తాట తీసి ఉతికి ఆరేసింది....

తాట తీసి ఉతికి ఆరేసింది.... - Sakshi


ఒకప్పుడు వేధింపులను మహిళలు, యువతులు మౌనంగా భరించేవారు. ఆధునిక సమాజంలోనూ అతివలపై ఆగడాలు ఆగడంలేదు. పరువు పోతుందనో, ఇంకోటో అని భయపడి మహిళలు మౌనంగా వేధింపులు సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని సైలెంట్ అయిపోతుంటారు. విద్యాధికులైన మగవలు సైతం వేధింపులపై మిన్నకుండిపోవడం జరుగుతోంది. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్టు కనబడుతోంది. ఇందుకు బెంగళూరులో ఓ యువతి చూపిన తెగువే తాజా నిదర్శనం.



తన వెంట పడుతున్న పోకిరికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది బెంగళూరు యువతి. తను అల్లరి చేయాలని చూసిన ఆకతాయి తాటతీసి.. గట్టిగా బుద్ధి చెప్పింది. వేధింపులకు గురి చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆకతాయికి ధైర్యంగా ఎదుర్కొంది. అంతేకాదు తనపట్ల అసభ్యంగా వ్యవహరించి పారిపోతున్న అతన్ని ఆమె వెంటాడి పట్టుకోవడమే కాకుండా.. మరీ చితక్కొట్టింది. మళ్లీ తన జోలికి వస్తే ఖబద్దార్ అంటూ కాళిక అవతారం ఎత్తింది. ఈ తతంగాన్ని ఆమె స్నేహితురాలు వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఫేస్ బుక్లో హల్ చల్ చేస్తోంది. తనలాగే ఎదురు తిరిగితే పోకిరిలు తోక ముడుస్తారంటూ తోటి స్త్రీలకు ఈ వీడియో ద్వారా సందేశం ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియోకు లైక్లు మీద లైక్లు వస్తున్నాయి.



వివరాల్లోకి వెళితే జయనగర్కు చెందిన వీణా ఆషియా...తన స్నేహితురాలితో ఓ రోజు జాగింగ్కు వెళ్లేది. అసలు విషయం ఆమె వెర్షన్లోనే విందాం. ‘ఈవ్‌టీజర్‌కు నేను గట్టి గుణపాఠం చెప్పాను. నేను రోజూ జాగింగ్‌కు వెళ్లే పార్కులో ఈ రోజు ఉదయం ఓ వ్యక్తి నన్ను సతాయించాడు. అతన్ని వెంటాడి పట్టుకోవడమే కాకుండా..నాలుగు గట్టిగా అంటించాను. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశా. పోలీసులు ఎంతో అండగా నిలిచారు’ అని ఈ నెల 8న ఆ వీణా ఆషియా తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది.



‘మనం కోరుకుంటూనే మార్పు వస్తుందని మహిళలకు చాటేందుకు నేను ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టాను’ అని ఆమె స్పష్టం చేసింది. ఈ వీడియోకు అప్పుడే 4 వేలకు పైగా లైకులు వచ్చాయి. పోకిరి సూర్యప్రకాష్ ప్రస్తుతం ఖాకీల అదుపులో ఉన్నాడు. పోకిరీని బుద్ధి చెప్పిన వీణా ఆషియాకు పోలీసుల నుంచి ప్రశంసలు లభించాయి.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top