ధోనితో అమిత్‌షా భేటీ

Amit Shah Meets Dhoni - Sakshi

సాక్షి​, న్యూఢిల్లీ : టీమిండియా సీనియర్‌ ఆటగాడు, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనితో బీజేపీ జాతీయాధ్యక్షుడు ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారంలో పాల్గొనాలని, బీజేపీకి మద్దతు తెలపాలని అమిత్‌ షా కోరారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల పాలనలో బీజేపీ​ ప్రభుత్వం సాధించిన విజయాలపై ఓ పుస్తకాన్ని ధోనికి బహుకరించారు. అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఈ భేటిలో పాల్గొన్నారు.

కాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అమిత్‌షా దేశ వ్యాప్తంగా ప్రముఖుల మద్దతు కోరుతున్న విషయం తెలిసిందే. ఇటీవల భారతీయ గానకోకిల లతా మంగేష్కర్‌తో కూడా అమిత్‌ షా భేటీ అయ్యారు. ఇటీవల మహారాష్ట్రా పర్యటనలో భాగంగా బాలీవుడ్‌ నటి మాధూరీ దీక్షిత్‌, వ్యాపారవేత్త రతన్‌ టాటా వంటి ప్రముఖులతో​ కూడా అమిత్‌ షా భేటీ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top