రెడ్ ‌జోన్‌లో దేశ రాజధాని జిల్లాలు

All Districts In Delhi Red Zone Central Notify - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మొత్తం 11 జిల్లాల్లోనూ వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం గుర్తించిన రెడ్‌జోన్ల జాబితాలో అ‍న్ని జిల్లాలను చేర్చింది. అంతేకాకుండా దేశ రాజధాని పరిధిలోని ఎన్‌‌సీఆర్‌ (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌‌) ప్రాంతంలో హాట్‌ స్పాట్‌ జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రం గుర్తించింది. వీటిలో ఫరీదాబాద్‌, గౌతమ్‌ బుద్దా, సోనీపేట్‌, నోయిడా సిటీలు కూడా ఉండటం గమనార్హం. ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో ఆయా జిల్లాలను హాట్‌స్పాట్‌ జోన్లుగా నోటిఫై చేసింది. (లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక భేటీ)

ఢిల్లీతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాలను కూడా కేంద్రం రెడ్‌జోన్ల జాబితాలో చేర్చింది. దేశ వ్యాప్తంగా మొత్తం 132 రెడ్‌జోన్లను కేంద్ర గుర్తించిన విషయం తెలిసిందే. వైరస్‌ తీవ్రతను బట్టి రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లగా వివిధ ప్రాంతాలను విభజించింది. మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 3515కు చేరగా.. మృతుల సంఖ్య 59కి పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులు మరింత అప్రమత్తం చేశారు. (తెలంగాణలో రెడ్‌, ఆరెంజ్‌ జోన్లు ఇవే)

కోటాకు 40 బస్సులు..
ఇక రాజస్తాన్‌లో కోటాలో చికుక్కున్న వారి కోసం ఆప్‌ సర్కార్‌ ప్రత్యేకంగా బస్సులను పంపింది. కోటాలో ఉన్న విద్యార్థులను దాదాపు 40 బస్సులతో ఢిల్లీకి తరలించనున్నారు. వారందరినీ స్వస్థలాలకు చేర్చిన తరువాత.. ప్రతి ఒక్కరూ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు రాష్ట్రంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. దీని కొరకు శుక్రవారం ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top