హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు.
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. హైదరాబాద్ వర్శిటీలో ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయను లక్ష్యం చేసుకోవడం సరికాదన్నారు.