బ్యాంకుల్లోనే ఆధార్‌ కేంద్రాలు: ఆర్‌బీఐ | Aadhaar enrolment, update services by banks, post offices | Sakshi
Sakshi News home page

బ్యాంకుల్లోనే ఆధార్‌ కేంద్రాలు: ఆర్‌బీఐ

Oct 8 2018 4:58 AM | Updated on Oct 8 2018 4:58 AM

Aadhaar enrolment, update services by banks, post offices - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రారంభించిన 13,000 ఆధార్‌ కేంద్రాలు యథాతథంగా కొనసాగుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్‌ భూషణ్‌ తెలిపారు. ఈ కేంద్రాలపై సుప్రీంకోర్టు తన తీర్పులో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ చేయాల్సిన అవసరం లేకుండా ఆఫ్‌లైన్‌ ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్లు ఆధార్‌ను గుర్తింపు పత్రంగా వాడుకోవచ్చని చెప్పారు. ఎవరైనా బ్యాంకు ఖాతా తెరిచేందుకు స్వచ్ఛందంగా ఆధార్‌ను సమర్పిస్తే అధికారులు అంగీకరిస్తారని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement