డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి | 3 died after stuck in Sewage Treatment Plant Thane West | Sakshi
Sakshi News home page

డ్రైనేజీ శుభ్రం చేస్తూ.. ముగ్గురు మృతి

May 10 2019 11:27 AM | Updated on May 10 2019 11:33 AM

3 died after stuck in Sewage Treatment Plant Thane West - Sakshi

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది.

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. డ్రైనేజీ శుభ్రం చేస్తూ ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన పశ్చిమ థానేలోని ధోకాలిలోని ప్రైడ్‌ ప్రెసిడెన్సీ లక్సేరియా నివాస సముదాయంలో చోటు చేసుకుంది.

డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషవాయువుల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement