త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం | త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం | Sakshi
Sakshi News home page

త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం

Feb 21 2018 12:25 AM | Updated on Feb 21 2018 12:25 AM

 న్యూఢిల్లీ: మహిళా ఎంపీలు, పార్లమెంటు అధికారులు, సిబ్బంది చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు అనువుగా త్వరలో పార్లమెంటులో శిశు సంరక్షక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రంలో తల్లులు పాలివ్వడానికి విడిగా మరో గదిని ఏర్పాటుచేయనున్నారు.

ఇప్పటికే ఈ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ  ఓ ప్రకటనలో పేర్కొంది. పార్లమెంటు మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది మహిళలే ఉన్నారని వారి చిన్నారుల కోసం ఈ కేంద్రం ఏర్పాటుచేయాలని గతేడాది మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement