
తమ్ముడికి వెరైటీగా విషెస్ చెప్పిన మంచు లక్ష్మి
తన సోదరుడు మంచు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సోదరి మంచు లక్ష్మి విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: తన సోదరుడు మంచు విష్ణు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన సోదరి మంచు లక్ష్మి విభిన్నంగా శుభాకాంక్షలు తెలిపారు. తమ్ముడి చంక ఎక్కి మరీ బర్త్ డే విషెస్ చెప్పారు. తమ్ముడిపై తనకున్న అపారమైన అనురాగాన్ని ఇలా వ్యక్తం చేశారామె. ఇక అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చూసి వారి తల్లి నిర్మల ఎంతో మురిసిపోయారు.
ఈ ఫోటోను లక్ష్మి తన ట్విటర్ పేజీలో పోస్టు చేశారు. విష్ణు తనకు సోదరుడి కన్నా ఎక్కువని, తండ్రి లాంటివాడని ఆమె పేర్కొన్నారు. అతడు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. నేడు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా 'సరదా'గా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో విష్ణు సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు.