వాళ్లు మళ్లీ కలిశారా? కోహ్లి-అనుష్క డిన్నర్! | Virat Anushka spotted on a dinner date, Are they back together? | Sakshi
Sakshi News home page

వాళ్లు మళ్లీ కలిశారా? కోహ్లి-అనుష్క డిన్నర్!

Apr 7 2016 2:12 PM | Updated on Sep 3 2017 9:25 PM

వాళ్లు మళ్లీ కలిశారా? కోహ్లి-అనుష్క డిన్నర్!

వాళ్లు మళ్లీ కలిశారా? కోహ్లి-అనుష్క డిన్నర్!

ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ విడిపోయారని అంతా అనుకున్నారు.

ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ విడిపోయారని అంతా అనుకున్నారు. ఇటు క్రికెట్‌లో అటు బాలీవుడ్‌లో అందమైన ప్రేమ జంటగా ముద్రపడిన వీరి మధ్య బ్రేకప్‌ అయినట్టు పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. కోహ్లి చేసిన పెళ్లి ప్రతిపాదనను అనుష్క ఒప్పుకోకపోవడమే వీరి బంధం తెగిపోవడానికి కారణమని వదంతులు షికారు చేశాయి. వీరు విడిపోవడం బాలీవుడ్ ప్రముఖులను కూడా కలిచివేసింది.

కానీ పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కోహ్లి-అనుష్క జంట మళ్లీ తమ అనుబంధాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజా ఈ ప్రేమపక్షులు జంటగా ఓ డిన్నర్‌ను ఎంజాయ్‌ చేశాయి. బుధవారం ముంబై బాంద్రాలోని రాయల్టీ క్లబ్‌లో ఈ ఇద్దరూ కలిసి డిన్నర్‌ విందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు చాలాసేపు మాట్లాడుతూ ఆనందంగా కనిపించినట్టు సన్నిహితులు చెప్తున్నారు. డిన్నర్ ముగిసిన తర్వాత ఇద్దరు కలిసి సల్మాన్‌ ఖాన్ ఇంటికి వెళ్లినట్టు సమాచారం.


ఆ ఇద్దరు కలిసి కనిపించడం విరుష్క (విరాట్-అనుష్క) అభిమానులకు పండుగే. కానీ కోహ్లి-అనుష్క తమ ప్రేమబంధాన్ని పునరుద్ధరించుకొని కలిసి ఉంటారా? లేదా స్నేహితులుగా అప్పుడప్పుడు కలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. కోహ్లితో తన అనుబంధాన్ని కొనసాగించేందుకు అనుష్క ఇష్టపడటం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌ సుల్తాన్‌, ఏ దిల్ హై ముష్కిల్‌ సినిమాల్లో అనుష్క నటిస్తోంది. తమ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి కోహ్లికి మరో చాన్స్ ఇచ్చేందుకు అనుష్క సిద్దంగా లేదని వారు అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement