నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్ | Vijay Mersal teaser world record | Sakshi
Sakshi News home page

నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్

Sep 22 2017 1:37 PM | Updated on Sep 22 2017 3:41 PM

Vijay Mersal teaser world record

సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్

సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది. అయితే అజిత్ అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. తాజాగా వివేగం రికార్డ్ ను విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ చెరిపేసింది. ఈ సినిమా టీజర్ కు కేవలం నాలుగు గంటల్లోనే 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

విజయ్ పేరిట అరుదైన రికార్డ్ క్రియేట్ చేయాలన్న పట్టుదలతో అభిమానులు చేసిన కృషి ఫలించింది. అత్యధిక లైక్స్ సాధించటం మాత్రమే కాదు కేవలం నాలుగు గంటల్లోనే ముప్పై లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు కేవలం 20 గంటల్లోనే కోటికి పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement