ఫియాన్సీ కాస్తా ప్రొడ్యూసర్‌ ఆయెనే!

Vignesh Shivan To Produce Nayanthara In Her Next - Sakshi

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ లవ్‌ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. ప్రేమను అధికారికంగా ప్రకటించకపోయినా పండగలు చేసుకోవడాలు, కలిసి టూర్‌కి వెళ్లడాలతో వ్యక్తపరుస్తుంటారు. ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో విఘ్నేశ్‌ను నయనతార ఫియాన్సీ (కాబోయే భర్త) అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఫియాన్సీ ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారట. ఇటీవల దర్శకుల్లో ఎక్కువ శాతం మంది నిర్మాణంలో భాగం అవ్వాలనుకుంటున్నారు. తాజాగా విఘ్నేశ్‌ కూడా ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారట.

నయనతార ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సిద్ధార్థ్, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘అవళ్‌’ (తెలుగులో గృహం) దర్శకుడు మిలింద్‌ రాజు ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నారు. శివ కార్తికేయన్‌తో చేస్తున్న ‘మిస్టర్‌ లోకల్‌’ షూటింగ్‌ పూర్తి చేశాక విజయ్‌ సరసన కమిట్‌ అయిన కొత్త షూటింగ్‌లో జాయిన్‌ అవ్వనున్నారు నయనతార. ఆ తర్వాత తన ఫియాన్సీ నిర్మించనున్న సినిమాను స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top