ఉద్యోగం చేసుకోవచ్చుగా అని తిట్టారామె! | vidhya balan looks like angel in sarry | Sakshi
Sakshi News home page

ఉద్యోగం చేసుకోవచ్చుగా అని తిట్టారామె!

Jan 25 2014 12:51 AM | Updated on Apr 3 2019 6:23 PM

ఉద్యోగం చేసుకోవచ్చుగా  అని తిట్టారామె! - Sakshi

ఉద్యోగం చేసుకోవచ్చుగా అని తిట్టారామె!

చీరకట్టుకు చిరునామా విద్యాబాలన్ అంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ‘అమ్మమ్మల్లా ఈ చీరలూ నువ్వూ..’ అని ఒకప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోలు విద్యాని మొహం మీదే విమర్శించారు.

 చీరకట్టుకు చిరునామా విద్యాబాలన్ అంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి ‘అమ్మమ్మల్లా ఈ చీరలూ నువ్వూ..’ అని ఒకప్పుడు కొంతమంది బాలీవుడ్ హీరోలు విద్యాని మొహం మీదే విమర్శించారు. కానీ, అవేం పట్టించుకోలేదామె. ఎక్కడికొచ్చినా తనకు నచ్చినట్లుగా నిండుగా చీరల్లోనే వస్తుంటారామె. ఇప్పుడా బాలీవుడ్ హీరోలు సైతం ‘నువ్వు కట్టడంవల్ల చీరలకే అందం వచ్చింది’ అంటున్నారు. ఇక, ఓ చిత్రకారుడైతే ‘విద్యా.. నువ్వు ఖజురహో శిల్పంలాంటిదానివి. ఆ శిల్పాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మనసులో ముద్రించుకుపోతుంది. నువ్వు కూడా అంతే’ అని అభినందించారట. ఈ విషయాన్ని స్వయంగా విద్యానే చెప్పారు. ఇంతకుమించిన మంచి అభినందన ఏముంటుంది? అని కూడా అన్నారు. ఇదిలా ఉంటే ఖజురహో శిల్పంలాంటి ఈ అందం ఇటీవల చిరిగిన బట్టల్లో, రేగిన జుత్తుతో హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో అడుక్కున్నారు.
 
 ‘బాబీ జాసూస్’ సినిమా కోసమే ఆమె ఈ పని చేశారు. నేరుగా రైల్వేస్టేషన్‌కి వెళ్లిపోయి, అక్కడ అడుక్కుంటున్నవాళ్ల పక్కన విద్యా కూర్చున్నారట. తమ పక్కన కూర్చున్నది విద్యా అని వాళ్లకెవరికీ తెలియదు. యూనిట్ సభ్యులు బుర్ఖాలు ధరించి, ఈ సీన్‌ని చిత్రీకరించారని విద్యా చెప్పారు. కాగా, విద్యా అడుక్కుంటున్నప్నుడు, ఓ వృద్ధురాలు వచ్చి, ‘శుభ్రంగా ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా..’ అని అడిగారట. అప్పుడు ఓ నవ్వు నవ్వుకున్నానని విద్యా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement