సీనియర్ మాటల రచయిత కన్నుమూత | Veteran Dialogue Writer RK Shanmugam Dies | Sakshi
Sakshi News home page

సీనియర్ మాటల రచయిత కన్నుమూత

Sep 14 2017 10:17 AM | Updated on Sep 19 2017 4:33 PM

సీనియర్ మాటల రచయిత  కన్నుమూత

సీనియర్ మాటల రచయిత కన్నుమూత

ఎంజీఆర్‌ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్‌ రచయిత ఆర్‌కే.షణ్ముగం మంగళవారం రాత్రి

తమిళసినిమా: ఎంజీఆర్‌ నటించిన 16 చిత్రాలకు మాటలు రాసిన సీనియర్‌ రచయిత ఆర్‌కే.షణ్ముగం మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. ఎంజీఆర్‌ నటించిన ఆయిరత్తిల్‌ ఒరువన్, ముఖరాశి, రహస్యపోలీస్‌ 115, నినైత్తదై ముడిప్పవన్, నీతిక్కు తలైవణంగు, పల్లాండు వాళ్గ, నాడోడి, చిరిత్తు వాళవేండుం 16 చిత్రాలకు షణ్ముగం మాటలను రాశారు.

అదేవిధంగా శివాజీగణేశన్ నటించిన పలు చిత్రాలకు సహాయదర్శకుడిగానూ పని చేశారు. షణ్ముగం గత కొన్ని వారాల క్రితం బాత్‌రూమ్‌లో జారి పడడంతో వెన్నెముక విరిగింది. అందుకు శస్త్ర చికిత్స చేయించుకున్నా, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. షణ్ముగంకు భార్య దేవి, కూతుళ్లు సత్యవతి, సంతానలక్ష్మీ ,ఈశ్వరి, మహాలక్ష్మీ ఉన్నారు. షణ్ముగం అంత్యక్రియలు బుధవారం జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement