కొత్తగా సరికొత్తగా... | Varaprasad varikuti being introduced as director | Sakshi
Sakshi News home page

కొత్తగా సరికొత్తగా...

Jan 2 2017 11:45 PM | Updated on Sep 5 2017 12:12 AM

కొత్తగా సరికొత్తగా...

కొత్తగా సరికొత్తగా...

ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్‌ వరికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన వరప్రసాద్‌ వరికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందు, సౌమ్యవేణుగోపాల్‌ జంటగా ఆయన దర్శకత్వంలో హరి హర చలనచిత్ర పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నూతన సంవత్సర సందర్భంగా ప్రముఖ కెమెరామ్యాన్‌ ఛోటా.కె. నాయుడు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘వరప్రసాద్‌ ఐ ఫోన్‌’ అనే వినూత్నమైన షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించా.

పూణే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి బెస్ట్‌ స్క్రీన్ ప్లే అండ్‌ డైరెక్షన్‌ కేటగిరిల్లో అవార్డులు అందుకున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘ఇంతలో ఎన్నెని వింతలో’ ఫ్యామిలీ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎవరూ టచ్‌ చేయని కథాంశంతో తీస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్‌.మురళి మోహన్‌రెడ్డి, సంగీతం: యాజమాన్య, లైన్‌ ప్రొడ్యూసర్‌: శ్రీనివాస్‌ ఓంకార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement