నవ్‌తేజ్‌ హుండల్‌ ఇకలేరు  | Uri Actor Navtej Hundal Dies in Mumbai | Sakshi
Sakshi News home page

నవ్‌తేజ్‌ హుండల్‌ ఇకలేరు 

Apr 10 2019 4:02 AM | Updated on Apr 10 2019 4:02 AM

Uri Actor Navtej Hundal Dies in Mumbai - Sakshi

‘ఖల్‌నాయక్, తేరే మేరే సస్నే, ఉరి’ వంటి చిత్రాల్లో నటించిన నవ్‌తేజ్‌ హుండల్‌ ఇక లేరు. బాలీవుడ్‌ సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన ఆయన సోమవారం ముంబైలో మృతిచెందారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన వార్‌ డ్రామా ‘ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమాలో హోంమంత్రి పాత్రలో నవ్‌తేజ్‌ నటించారు. ఆయన వయసు సుమారు 60. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కూతురు అవంతిక హుండల్‌ టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. నవ్‌తేజ్‌ మృతిపట్ల సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోషియేష తో పాటు పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement