చెప్పని కథ! | The Untold Story Of Sunny Leone Trailer | Sakshi
Sakshi News home page

చెప్పని కథ!

Jul 7 2018 1:22 AM | Updated on Jul 7 2018 1:22 AM

The Untold Story Of Sunny Leone Trailer - Sakshi

సన్నీ లియోన్‌

కరణ్‌ జీత్‌ కౌర్‌ వోహ్రా అంటే చాలా తక్కువమందికి తెలిసి ఉంటుంది. కానీ సన్నీ లియోన్‌ అంటే తెలియనివాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. యస్‌.. ఇద్దరూ ఒకరే. సన్నీనే కరణ్‌ జీత్‌. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అంటే సన్నీ లియోన్‌ లైఫ్‌ ఆధారంగా ‘కరణ్‌ జీత్‌ కౌర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్‌’ అనే వెబ్‌ సీరిస్‌ రూపొందుతోంది. ఈ నెల 16న ఓ ఆంగ్ల చానెల్‌లో ఫస్ట్‌ ఎపిసోడ్‌ ప్రసారం కానుందట. యంగ్‌ సన్నీ రోల్‌ చేసిన రసా సౌజానీ మాట్లాడుతూ– ‘‘12–15 ఏజ్‌లో ఉన్న సన్నీ లియోన్‌  పాత్ర చేశాను. చాలెంజింగ్‌ రోల్‌గా ఫీలయ్యా. ఆమె జర్నీలో ఎమోషనల్‌ డెప్త్‌ ఉంది’’ అన్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వడివుడయాన్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘వీరమహాదేవి’ సినిమాలో నటిస్తున్నారు సన్నీ లియోన్‌. హీరోయిన్‌గా ఆమె సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమా ఇదే.

Advertisement
 
Advertisement
Advertisement