తానాజీ కాదు.. తన్హాజీ!

The Unsung Warrior to release on January 10 - Sakshi

మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తానాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ పేరుతో ఓ హిందీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ రోల్‌లో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నారు. ఓమ్‌ రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ లుక్‌ ఇటీవల విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కొత్త సంవత్సరాన్ని నాతో మొదలుపెట్టండి.

ఎందుకంటే జనవరి 10న ‘తన్హాజీ’ రిలీజ్‌ కానుంది’’ అని అజయ్‌ ట్వీట్‌ చేశారు. టైటిల్‌లో మార్పు గమనించారా? ముందు ‘తానాజీ’ అనుకున్నారు. ఇప్పుడు ‘తన్హాజీ’ అంటున్నారు. న్యూమరాలజీ ప్రకారం ఈ మార్పు చేశారట. అజయ్‌ దేవగన్, భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ ముగ్గురూ ఓ ప్రముఖన్యూమరాలజిస్ట్‌ని కలిశారట. ఆయన సూచించిన మేరకే టైటిల్‌ని ‘తన్హాజీ’గా మార్చారట.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top