'మా సినిమాను బ్యాన్ చేయలేదు' | Udta Punjab is Not Banned | Sakshi
Sakshi News home page

'మా సినిమాను బ్యాన్ చేయలేదు'

May 29 2016 1:17 PM | Updated on Sep 4 2017 1:12 AM

'మా సినిమాను బ్యాన్ చేయలేదు'

'మా సినిమాను బ్యాన్ చేయలేదు'

షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ లు లీడ్ రోల్స్లో నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న...

షాహిద్ కపూర్, కరీనా కపూర్, అలియా భట్ లు లీడ్ రోల్స్లో నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఉడ్తా పంజాబ్. పంజాబ్లో జరుగుతున్న డ్రగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ సినిమాను సర్టిఫై చేయడానికి అంగీకరించటం లేదని, అసలు పూర్తిగా సినిమాను బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చిత్ర సహనిర్మాత అనురాగ్ కశ్యప్, నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ క్లారిటీ ఇచ్చాయి. తమ సినిమాను బ్యాన్ చేయలేదని, ఎగ్జామినింగ్ కమిటీలో సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వాలన్న విషయంలో అభిప్రాయాభేదాలు వచ్చాయని, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ ముందు ఉందని, త్వరలోనే సినిమాపై ప్రకటన వస్తుందని తెలిపారు. అభిషేక్ చౌబే దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో షాహిద్ కపూర్ పాత్ర అసభ్యకర డైలాగ్లు ఉన్నాయన్న కారణంతో సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement