నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను | Udaya Bhanu complains on Madhumati movie Producer | Sakshi
Sakshi News home page

నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను

Dec 14 2013 1:27 AM | Updated on Sep 2 2017 1:34 AM

నన్ను నమ్మించి  మోసం చేశారు - ఉదయభాను

నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను

‘‘తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని... ఈ చిత్రంతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి ‘మధుమతి’ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ నన్ను మోసం చేశారు’’ అని ఉదయభాను ఆరోపించారు.

‘‘తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని... ఈ చిత్రంతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి ‘మధుమతి’ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ నన్ను మోసం చేశారు’’ అని ఉదయభాను ఆరోపించారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడు. పైగా పారితోషికం కింద రెండు లక్షల రూపాయలే ఇచ్చారు’’ అని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు.
 మార్ఫింగ్ చేయలేదు: ఈ వివాదం గురించి దర్శకుడు రాజ్‌శ్రీధర్ స్పందిస్తూ... ‘మధుమతి’ ప్రోమోలో తాను ఎలాంటి మార్ఫింగ్‌కూ పాల్పడలేదన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న ఉదయభాను ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. తగిన సాక్ష్యాలతో ఆరోపణలు చేయాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement