త్రిష @ 50 | trisha 50th film chikati rajyam | Sakshi
Sakshi News home page

త్రిష @ 50

Sep 17 2015 11:09 AM | Updated on Sep 3 2017 9:34 AM

త్రిష @ 50

త్రిష @ 50

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ కెరీర్ లో అయిన 50 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ను అందుకుంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోలందరితో కలిసి...

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ హీరోయిన్ కెరీర్ లో అయిన 50 సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన రికార్డ్ను అందుకుంది సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష. టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన ఈ భామ బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. ఎక్కువగా సౌత్ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటి కొంత కాలంగా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.

పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతో సినిమాలకు దూరమైన త్రిష తరువాత పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో తిరిగి సినిమాలు సైన్ చేయటం ప్రారంభించింది. తాజాగా తన 50వ సినిమాగా లోకనాయకుడు కమల్ హాసన్ తో కలిసి చీకటిరాజ్యం సినిమాలో నటిచింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ బ్యూటి యాక్షన్ సీన్స్లోనూ అదరగొట్టింది. ఈ సినిమాతో పాటు మరో ఐదు సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటి.

Advertisement
 
Advertisement
Advertisement