స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test - Sakshi

1. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌లో లవ్లీగా కనిపించిన ఈ బ్యూటీ తెలుగులో అరంగేట్రం చేసి, ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించారు. ఎవరామె?
ఎ) తమన్నా బి) క్యాథరిన్‌  సి) ఇలియానా డి) లావణ్య త్రిపాఠి

2. భారతీయ చలనచిత్ర రంగం గర్వించదగ్గ  దర్శకుడు కె. విశ్వనాథ్‌. ఆయన దర్శకుడవ్వక ముందు ఏ శాఖలో పనిచేశారో తెలుసా?
ఎ) ఆడియోగ్రఫీ    బి) ఎడిటింగ్‌  సి) కెమెరా డిపార్ట్‌మెంట్‌  డి) ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌

3. ‘షేక్‌ మోజెస్‌ మూర్తి’ పేరు భలే తమాషాగా ఉంది కదూ. 1972లో విడుదలైన ‘మల్లె పందిరి’ సినిమాలో ఈ పేరుతో ఉన్న క్యారెక్టర్‌ను పోషించిన గాయకుడెవరో తెలుసా?
ఎ) ఎస్పీ బాలు   బి) రామకృష్ణ  సి) ఘంటసాల  డి) ఇళయరాజా

4. కథానాయిక సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ఏ నటుని సరసన నటిస్తున్నారు?
ఎ) రామ్‌    బి) శర్వానంద్‌  సి) నాని     డి) సందీప్‌ కిషన్‌

5. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఓ సినిమాలో హీరో ‘అల్లరి నరేశ్‌’ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో నరేశ్‌ ఏ హీరోతో కలిసి నటిస్తున్నారో తెలుసా?
ఎ) రామ్‌ చరణ్‌    బి) అల్లు అర్జున్‌  సి) మహేశ్‌ బాబు  డి) వెంకటేశ్‌

6. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా అరంగేట్రం చేసిన ‘అల్లుడు శీను’ చిత్రదర్శకుడెవరో గుర్తు తెచ్చుకోండి?
ఎ) వీవీ వినాయక్‌  బి) శ్రీను వైట్ల  సి) బోయపాటి శ్రీను  డి) శ్రీవాసు

7. 1998లో మోహన్‌బాబు నటించిన ‘రాయుడు’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన నటì  ఎవరో తెలుసా? 2001లోనే ఆమె చనిపోయారు?
ఎ) దివ్యభారతి    బి) ప్రత్యూష  సి) సౌందర్య       డి) భార్గవి

8. ‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున సరసన నటించిన హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రియ శరన్‌     బి) త్రిష  సి) సోనాలి బింద్రే  డి) రవీనా టాండన్‌

9.  ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే’... అనే పాటతో Ðð లుగులోకి వచ్చిన హాట్‌ గర్ల్‌ ఎవరో తెలుసా?
ఎ) హంసా నందిని బి) ర మ్యశ్రీ  సి) అభినయశ్రీ  డి) ముమైత్‌ ఖాన్‌

10. ‘గులాబి’ చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఆ చిత్రనిర్మాత ఎవరో కనుక్కోండి చూద్దాం?
ఎ) కృష్ణవంశీ    బి) జేడీ చక్రవర్తి  సి) రామ్‌గోపాల్‌ వర్మ  డి) సురేశ్‌ బాబు

11. శ్రీదేవి చెల్లెలిగా హీరోయిన్‌ మహేశ్వరి అందరికీ పరిచయమే. ఆమెను సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా?
ఎ) భారతీరాజా  బి) కోడి రామకృష్ణ  సి) బాలచందర్‌  డి) కె. రాఘవేంద్రరావు

12. రజనీకాంత్‌ నటించిన ‘కొచ్చాడియాన్‌’ చిత్రంలో ఆయన సరసన నటించిన బాలీవుడ్‌ భామ ఎవరో కనుక్కోండి?
ఎ) ఐశ్వర్యారాయ్‌  బి) సోనాక్షి సిన్హా  సి) దీపికా పదుకోన్‌  డి) అమీ జాక్సన్‌

13. ‘‘క్యారెక్టర్‌ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే, చావు రాక ముందు చచ్చిపోవటమే’’... అనే డైలాగ్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోనిది.  రచయితెవరో తెలుసా?
ఎ) వంశీ పైడిపల్లి  బి) వక్కంతం వంశీ  సి) అబ్బూరి రవి  డి) కోన వెంకట్‌

14 ‘దారి చూడు దుమ్ము చూడు మామా.. దున్నపోతుల భేరే చూడు’ అనే పాటను పాడిందెవరో తెలుసా?
ఎ) అనుదీప్‌    బి) హేమచంద్ర  సి) హిప్‌ హాప్‌ తమిళ  డి) పెంచల్‌ దాస్‌

15. చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్, అక్కినేని మనవరాలు సుప్రియ ఇద్దరికీ  మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఆ చిత్ర దర్శకుడెవరు?
ఎ) ముత్యాల సుబ్బయ్య  బి) ఈదర వీర వెంకట సత్యనారాయణ  సి) ఎ. కోదండ రామిరెడ్డి  డి) యస్‌.జె. సూర్య

16. ‘100 పర్సెంట్‌ లవ్‌’ సినిమాలో ‘ఏ స్క్వేర్‌ బీ స్క్వేర్‌ ఏ ప్లస్‌ బి హోల్‌ స్క్వేర్‌’ అనే పాటను హమ్‌ చేసింది సింగర్‌ కాదు. ఆమె ఓ నటి. ఎవరామె?
ఎ) కలర్స్‌ స్వాతి    బి) రాశీ ఖన్నా  సి) తమన్నా భాటియా  డి) అనుపమా పరమేశ్వరన్‌

17. తెలుగు అగ్ర హీరోల్లో ఓ హీరో ఇప్పుడు సౌదీలో షూటింగ్‌ జరుపుకుంటున్నారు. నెలకుపైగా అక్కడే షూటింగ్‌లో ఉన్న ఆ హీరో ఎవరు?
ఎ) ప్రభాస్‌        బి) ఎన్టీఆర్‌  సి) రామ్‌  డి) వరుణ్‌తేజ్‌

18. ‘జంబలకడి పంబ’ అనే సినిమా 1993లో విడుదలై సంచలన విజయం సాధించింది. అప్పటి సినిమాలో హీరో నరేశ్, ఇప్పుడు అదే పేరుతో తయారైన ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా?
ఎ) ‘వెన్నెల’ కిశోర్‌ బి) ‘షకలక’ శంకర్‌ సి) ధన్‌రాజ్‌ డి) శ్రీనివాసరెడ్డి

19. ఈ కింది ఫొటోలోని బాలీవుడ్‌ హీరో ఎవరో చెప్పండి?
ఎ) సల్మాన్‌ఖాన్‌ బి) షారుక్‌ ఖాన్‌ సి) ఆమిర్‌ ఖాన్‌ డి) సైఫ్‌అలీ ఖాన్‌

20. ఈ ఫొటోలో మేకప్‌ చేసుకుంటున్న హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టండి?
ఎ) విజయశాంతి బి) భానుప్రియ  సి) సుహాసిని      డి) జయప్రద

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (బి) 5) (సి) 6) (ఎ) 7) (బి) 8) (సి) 9) (డి) 10) (సి)

11) (ఎ) 12) (సి) 13) (బి) 14) (డి) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (డి) 19) ఎ 20) బి

నిర్వహణ: శివ మల్లాల
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top