హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి | Sakshi
Sakshi News home page

హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి

Published Tue, Dec 29 2015 8:28 AM

హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి - Sakshi

టాలీవుడ్‌కు 2015 అచ్చిరానట్లుంది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ ఏడాదిలో దివం గతులయ్యారు. తాజాగా మరో హాస్య నటుడు పొట్టి రాంబాబు (35) అనారోగ్యంతో మంగళ వారం మృతి చెందారు. రాజమండ్రి సమీపంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన రాంబాబు తెలుగుతెరపైకి వచ్చింది హీరో ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’తో. ‘చంటిగాడు’, ‘దొంగ -దొంగది’, ‘కథానాయకుడు’, ‘దొంగల బండి’, ‘ అస్త్రం’, ‘గోపి-గోపిక-గోదావరి’ తదితర 40కి పైగా చిత్రాల్లో నటించారు.
 
  ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ నిర్మాణంలో ఉంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మూడు రోజుల క్రితం ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. చివరకు ఆస్పత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు. రాంబాబుకు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. రాంబాబు మృతి పట్ల సినీ, టీవీ కళాకారులు సంతాపం తెలిపారు.
 
 ఆస్పత్రి బిల్లు చెల్లించడానికి కానీ, చివరకు అంబులెన్స్‌కు చెల్లించడానికి కానీ డబ్బులు లేని పరిస్థితుల్లో రాంబాబు కన్నుమూయడం విషాదం. ఈ పరిస్థితుల్లో ‘మా’ అధ్య క్షుడు రాజేంద్రప్రసాద్, లక్ష్మీ మంచు, శివాజీ రాజా, కాదంబరి కిరణ్, అభినయ కృష్ణ, ప్రభా కర్, విజయ్‌రెడ్డి, శ్రీరామ్, వినోద్‌బాల, నిరు పమ్, భావన, నిర్మాత బిఏ రాజు, దర్శకుడు రాఘవ స్పందించి ఆర్థికసాయం చేశారు.
 

Advertisement
Advertisement