శిరస్సు వంచి నమస్కరిస్తున్నా | tollywood bows it's head to rajamouli on baahubali success | Sakshi
Sakshi News home page

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

Jul 10 2015 4:38 PM | Updated on Aug 11 2019 12:52 PM

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా - Sakshi

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

బాహుబలి మీద టాలీవుడ్ వర్గాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళిని, నిర్మాతలను, నటీనట వర్గాన్ని, సాంకేతిక నిపుణులను ఆకాశానికి ఎత్తేశారు.

బాహుబలి మీద టాలీవుడ్ వర్గాలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు రాజమౌళిని, నిర్మాతలను, నటీనట వర్గాన్ని, సాంకేతిక నిపుణులను ఆకాశానికి ఎత్తేశారు.

ప్రతి భారతీయుడూ గర్వపడాలి. ఈ స్థాయి సినిమా తీసిన దేశంలో పుట్టినందుకు మేమంతా చాలా గర్విస్తున్నాం. థాంక్యూ రాజమౌళి సర్
-అఖిల్ అక్కినేని

తెలుగు సినిమా అంతర్జాతీయంగా ఒక గొప్ప విజయం సాధించిన రోజుగా ఈరోజు చరిత్రలో గుర్తుండిపోతుంది. ప్రజలు ఒకరోజు తప్పకుండా దీన్ని మళ్లీ గుర్తిస్తారు. థాంక్యూ బాహుబలి
-నిఖిల్ సిద్దార్థ

బాహుబలి అద్భుత విజయానికి మొత్తం బృందానికి అభినందనలు. ఇది కేవలం ఒక సినిమా కాదు.. గర్వకారణం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభలో ఇది టాప్. తప్పనిసరిగా అందరూ చూడాల్సిందే
-నయనతార

బాహుబలి సినిమాను నేనే నిర్మించినట్లు అనిపిస్తోంది. ఎంత అద్భుతం.. సినిమా అంటే అసలు ఇలా ఉండాలి. ఎస్ఎస్ రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. బాహుబలి పూర్తిస్థాయిలో కళ్లకు విందు చేస్తుంది. రెండో భాగం కోసం నేను ఏమాత్రం వేచి ఉండలేను. వెళ్లి చూడండి
-లక్ష్మీ మంచు

ఎస్ఎస్ రాజమౌళి సర్కు సెల్యూట్. దీని గురించి చెప్పడానికి మాటలు చాలట్లేదు. అత్యంత అద్భుతమైన సినిమా. రెండో భాగం కోసం ఆగలేను. బాహుబలి బృందానికి కంగ్రాట్స్
-రఘు కుంచె

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement