అజిత్‌తో ముచ్చటగా... | Third time with ajit | Sakshi
Sakshi News home page

అజిత్‌తో ముచ్చటగా...

May 15 2014 11:09 PM | Updated on Sep 2 2017 7:23 AM

అజిత్‌తో ముచ్చటగా...

అజిత్‌తో ముచ్చటగా...

పెళ్లి కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. ఈమెకు వరుడిని అన్వేషించే కార్యక్రమాన్ని ఆమె తల్లి వేగవంతం చేసినట్లు సమాచారం.

పెళ్లి కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. ఈమెకు వరుడిని అన్వేషించే కార్యక్రమాన్ని ఆమె తల్లి వేగవంతం చేసినట్లు సమాచారం. ఇంతకు ముందు డిమాండ్ లేకపోయినా మూడు పదులు వయసు దాటిన త్రిష నేటికీ హీరోయిన్‌గా తన ఉనికిని చాటుకుంటూనే ఉండడం విశేషం. తాజాగా అజిత్ సరసన రెండవ హీరోయిన్‌గా నటించడానికి ఈ చెన్నై చిన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విన్నై తాండి వరువాయా చిత్రంలో జెస్సీ పాత్రనిచ్చి మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన దర్శకుడు గౌతమ్‌మీనన్ మరో సారి ఈ అవకాశం కల్పించారు. ఆరంభం వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆ చిత్ర సమర్పకుడు ఏఎం రత్నం నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్ సరసన ఇప్పటికే ఒక హీరోయిన్‌గా అనుష్క నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా త్రిష పేరు పరిశీలనలో ఉన్నా అధికారికంగా ప్రకటించలేదు.
 
 అజిత్ సరసన నటిస్తున్న విషయాన్ని నటి త్రిష తాజాగా స్పష్టం చేశారు. ఇటీవలే చిత్ర దర్శకుడు గౌతమ్‌మీనన్ త్రిషకు కథ వినిపించారట. ఆమె ఇంకా ఒప్పంద పత్రాలలో సంతకం చేయకపోయినా నటించడానికి అంగీకారం తెలిపారట. చిత్రంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందంటున్న త్రిష, సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన నటించే చిత్రం ఆగిపోవడంతో ఆ కాల్‌షీట్స్‌ను అజిత్ చిత్రానికి కేటాయించినట్లు తెలిసింది. ఈ చిత్రం కోసం గౌతమ్‌మీనన్ ఇప్పటికే అజిత్, అనుష్కల మధ్య ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌లో త్రిష పాల్గొననున్నారట. మరో విషయం ఏమిటంటే ఇప్పటికే త్రిష అజిత్‌తో కిరీటం, మంగాత్త చిత్రాల్లో జత కట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఆయనతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement