ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే! | Sakshi
Sakshi News home page

ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే!

Published Tue, Oct 7 2014 9:55 AM

ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే!

హైదరాబాద్: గోవిందుడు అందరివాడేలే చిత్రం ఆ విధంగా రూపొందించిన క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదేనని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్చాట్లో బండ్ల గణేష్తోపాటు హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో  రామ్చరణ్ - కాజల్ మూడవసారి జంటగా నటించారు. హ్యాట్రిక్  విజయం సాధించారు. ఈ మూవీ నిర్మాణంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఆ ముగ్గురు రామ్ చరణ్ - కృష్ణవంశీ - పరుచూరి వెంకటేశ్వర రావు అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.  

 ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి సినిమా రావలసిన అవసరం ఉందని కృష్ణ వంశీ చెప్పినట్లు తెలిపారు.ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.తెలుగు చిత్రం పరిశ్రమకు ఆయన ఓ వరం అన్నారు.  ఫ్యామిలీ డ్రామా, కుటుంబ బంధాలు - అనుబంధాలతోపాటు పల్లెటూరి నేపధ్యంలో చిత్రం నిర్మించడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉండి సహకరించినట్లు తెలిపారు.

మెగా ఫ్యామిలీ చిరంజీవి-పవన్ కల్యాణ్- రామ్ చరణ్లతో చిత్రం నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ఆ రకమైన ఆలోచన మరీ ఎక్కువ ఆశైపోతుందని గణేష్ అన్నారు. చిరంజీవి 150వ సినిమా నిర్మిస్తారా? అగి అడగగా, అటువంటి అవకాశం లేదని చెప్పారు. అయితే  ప్రయత్నిస్తానని అన్నారు.

గ్రామీణ వాతావరణంలో, కుటుంబ నేపథ్యంలో ఇటువంటి చిత్రాలు రూపొందించడంలో కృష్ణవంశీది అందెవేసి చేయని శ్రీకాంత్ అన్నారు. ఆయన కూడా పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు.
**

Advertisement
 
Advertisement
 
Advertisement