తేజ్‌ ఈజ్‌ కమింగ్‌

tej i love you movie released on july 6 - Sakshi

లవ్‌ స్టోరీల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘తేజ్‌’.  ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై కె.ఎస్‌ రామారావు నిర్మించారు. ఈ చిత్రం ఆడియో ఇటీవలే రిలీజ్‌ అయింది.

ఆడియోకు వస్తున్న రెస్పాన్స్‌తో ఈ చిత్రబృందం ఆడియో సక్సెస్‌ మీట్‌ను ఈ శనివారం విజయవాడలో నిర్వహించనుంది. ‘‘కరుణాకరన్‌ స్టైలో సాగే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. మంచి ఫీల్‌తో సాగే లవ్‌ స్టోరీ. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జూలై 6న రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: ‘డార్లింగ్‌’ స్వామి, సహ నిర్మాత: వల్లభ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top